యూఎస్ నుంచి తిరిగి వచ్చారు !

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా.. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో సెలెబ్రిటీ గెస్ట్‌లుగా పాల్గొన్న సంగతి తెలిసిందే. వీరు భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని విదేశాల్లోని భారతీయులతో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. అనంతరం, వారు కొద్ది రోజుల పాటు అమెరికాలో విహారయాత్ర కోసం ఉండిపోయారు.
తాజాగా ఆ ఇద్దరూ .. హైదరాబాద్ విమానాశ్రయంలో కలిసి కనిపించారు. దీంతో వారి సంబంధం గురించి మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. వీరిద్దరూ గాఢమైన రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది వారు పెళ్లి చేసుకోవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
అయితే.. అంతకన్నా ముందు.. ఫ్యాన్స్ వీరిని మరోసారి తెరపై కలిసి చూడబోతున్నారు. విజయ్ దేవరకొండ రాబోయే చిత్రంలో రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ పీరియడ్ డ్రామా బ్రిటిష్ యుగంలో రాయలసీమ నేపథ్యంలో సెట్ చేయబడింది, ఇందులో రష్మికా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది వీరి మూడవ సినిమాటిక్ కలయిక.
-
Home
-
Menu