‘కింగ్ డమ్’ మళ్లీ వాయిదా పడుతుందా?

‘కింగ్ డమ్’ మళ్లీ  వాయిదా పడుతుందా?
X
నితిన్ నటిస్తున్న “తమ్ముడు” సినిమా.. కింగ్‌డమ్ మళ్లీ వాయిదా పడుతుందని తెలిసి, అదే రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. విజయ్ దేవరకొండ టీమ్ నుండి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా “కింగ్‌డమ్” రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లు స్పష్టమవుతోంది.

విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో కఠినమైన దశను ఎదుర్కొంటున్నాడు. ఆయన ఇటీవలి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. అతడు కమర్షియల్ సక్సెస్ ఇచ్చి చాలా కాలమైంది. ఈ సమయంలో తనకి బలమైన కంబ్యాక్ చాలా అవసరం. కానీ అతడి తదుపరి సినిమా రిలీజ్‌పై అనిశ్చితి నెలకొని ఉంది.

విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “కింగ్‌డమ్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మొదట మార్చిలో రిలీజ్ కావాల్సి ఉండగా, పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఆ తర్వాత జులై 4, 2025కి రిలీజ్ డేట్ ఖరారు చేశారు. అయితే.. నితిన్ నటిస్తున్న “తమ్ముడు” సినిమా.. కింగ్‌డమ్ మళ్లీ వాయిదా పడుతుందని తెలిసి, అదే రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది.

విజయ్ దేవరకొండ టీమ్ నుండి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా “కింగ్‌డమ్” రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితి విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్‌ల ప్లానింగ్ అండ్ నిర్ణయాలలో లోపాలను సూచిస్తోంది. “కింగ్‌డమ్” సినిమా రిలీజ్‌లో పదేపదే జరుగుతున్న ఆలస్యాలు, ఈ సినిమా క్రమంగా ఊపు కోల్పోతున్న విధానానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి.

Tags

Next Story