కొత్త సినిమా షూటింగ్ మొదలైంది !

కొత్త సినిమా షూటింగ్ మొదలైంది !
X
విజయ్ దేవరకొండ ఇటీవల అమెరికా వెళ్లాడు. దీంతో షూటింగ్ కాస్త ఆలస్యమైంది. అయితే, తాజాగా.. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ మొదలైంది.

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా కోసం సంవత్సరం పాటు కష్టపడ్డాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకుంటున్నాడు. అతని నెక్స్ట్ సినిమా గురించి చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ సినిమా పూజా కార్యక్రమానికి ముందు కొంతకాలం ఆగిపోయింది. రాహుల్ సంకృత్యాయన్ తెరకెక్కించబోతున్న ఈ సినిమా బడ్జెట్‌ను మేకర్స్ సవరించారు.

విజయ్ దేవరకొండ ఇటీవల అమెరికా వెళ్లాడు. దీంతో షూటింగ్ కాస్త ఆలస్యమైంది. అయితే, తాజాగా.. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ మొదలైంది. హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది, కానీ ఆమె కొంత తర్వాత సెట్స్‌లో జాయిన్ అవుతుంది. ఈ సినిమాను విజయ్ దేవరకొండ పుట్టినరోజైన మే 9న ఈ ఏడాది ప్రకటించారు.

ఇది 19వ శతాబ్దంలో బ్రిటిష్ కాలనీ యుగంలో రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా. ‘రణభూమి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. టి-సిరీస్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం బోలెడు డేట్స్ కేటాయించాడు. త్వరగానే షూటింగ్ పూర్తి చేయనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

Tags

Next Story