విజయ్ ఆంటోని ‘భద్రకాళి‘ టీజర్!

విజయ్ ఆంటోని ‘భద్రకాళి‘ టీజర్!
X


విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా విలక్షణమే ప్రధానంగా సాగే కథానాయకులు కొంతమంది ఉంటారు. అలాంటి హీరోల్లో ముందు వరుసలో నిలుస్తాడు విజయ్ ఆంటోని. ఇటీవలే విజయ్ ఆంటోని తన ప్రతిష్ఠాత్మక 25వ చిత్రంగా ‘పరాశక్తి‘ మూవీని అనౌన్స్ చేశాడు. అయితే అదే టైటిల్ తో శివకార్తికేయన్ కూడా సినిమా చేస్తుండడంతో.. తన సినిమాకి తమిళంలో ‘శక్తి తిరుమగన్‘, తెలుగులో ‘భద్రకాళి‘ టైటిల్ ను ఫిక్స్ చేశాడు.



విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ రిలీజయ్యింది. ఈ టీజర్‌లో భారీ స్కామ్‌, మాయమైన కోట్లాది రూపాయల కారణంగా దేశవ్యాప్తంగా కలకలం రేగడం వంటి అంశాలను చూపించారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్ లో విజయ్ ఆంటోని డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఏదో సందేశాన్ని అందిస్తూ ఈ చిత్రం రాబోతుందని టీజర్ ను బట్టి తెలుస్తోంది.

Tags

Next Story