న్యూయార్క్ నగర వీధుల్లో .. విజయ్ అండ్ రష్మిక

న్యూయార్క్ నగర వీధుల్లో .. విజయ్ అండ్ రష్మిక
X
తాజాగా జరిగిన 43వ ఇండియా డే పరేడ్‌లో ఈ జంటను గ్రాండ్ మార్షల్స్‌గా గౌరవించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే ఈ వార్షిక ఈవెంట్‌లో... విజయ్, రష్మిక సెలబ్రిటీస్ గా పండుగను నడిపించారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న న్యూయార్క్ నగర వీధుల్లో చేతులు పట్టుకుని నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా జరిగిన 43వ ఇండియా డే పరేడ్‌లో ఈ జంటను గ్రాండ్ మార్షల్స్‌గా గౌరవించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే ఈ వార్షిక ఈవెంట్‌లో... విజయ్, రష్మిక సెలబ్రిటీస్ గా పండుగను నడిపించారు. ఆ ఇద్దరూ అభిమానులకు అభివాదం చేస్తూ.. అలంకరించిన వ్యాన్‌పై ర్యాలీలో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఉత్సాహంగా ఉన్న భారతీయ-అమెరికన్ సమాజంతో కలిసి నడిచారు. డేటింగ్ రూమర్స్ నడుస్తున్న నేపథ్యంలో, విజయ్ మరియు రష్మిక చేతులు పట్టుకుని ఉన్న దృశ్యం అభిమానులను ఆనందపరిచింది. వారు చేతులు పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ఉత్సాహాన్ని రేకెత్తించింది.

సినిమాల విషయానికొస్తే .. చివరిగా “కింగ్‌డమ్” సినిమాలో కనిపించిన విజయ్ దేవరకొండ, ఇప్పుడు రష్మికతో కలిసి రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఒక పీరియడ్ డ్రామాలో నటించ నున్నాడు. ఈ జనాదరణ పొందిన జంట గతంలో “గీత గోవిందం” , “డియర్ కామ్రేడ్” వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు వారి తదుపరి సహకారం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story