విక్కీ కౌశల్ సందేశం.. ‘ఛావా’ మీ కోసమే!

X
విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రక చిత్రం ‘ఛావా’ ఇప్పటికే హిందీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.550 కోట్లు వసూళ్లను కొల్లగొట్టింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.
‘ఛావా‘ సినిమా హిందీలో విడుదలైనప్పటినుంచీ ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలనే డిమాండ్స్ పెరిగాయి. ఈకోవలోనే రేపు (మార్చి 7) గీతా ఆర్ట్స్ ద్వారా ‘ఛావా‘ తెలుగులో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ‘ఛావా‘ హీరో విక్కీ కౌశల్ తెలుగు ప్రేక్షకుల కోసం ఓ సందేశాన్ని అందించాడు. తెలుగు ఆడియన్స్ డిమాండ్ మేరకు ‘ఛావా‘ వస్తోందని తన వీడియోలో తెలిపాడు.
Next Story
-
Home
-
Menu