విక్కీ కౌశల్ ‘ఛావా’ – తెలుగు ప్రేక్షకులకు పండుగ!

విక్కీ కౌశల్ ‘ఛావా’ – తెలుగు ప్రేక్షకులకు పండుగ!
X


'ఛావా' సినిమా హిందీ భాషలో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. మరాఠా సామ్రాజ్యపు చక్రవర్తి ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించాడు. రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం, విడుదలైన తొలి వారంలోనే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే రూ. 400 కోట్ల క్లబ్ లో చేరి రూ. 500 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తుంది.

ఛావా విడుదలైనప్పటి నుండి, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని తమ భాషలో చూడాలనే ఆసక్తిని వ్యక్తపరిచారు. సోషల్ మీడియాలో తెలుగు వెర్షన్ విడుదలపై పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఆ డిమాండ్స్ ఫలించాయి. మార్చి 7న ఛావా తెలుగులో విడుదలకు ముస్తాబవుతోంది.

Tags

Next Story