ఆ మూవీకి సీక్వెల్ డిక్లేర్ చేశాడు !

ఆ మూవీకి సీక్వెల్ డిక్లేర్ చేశాడు !
X
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి సంచలన విషయాలు షేర్ చేశాడు. 'లక్కీ భాస్కర్' సినిమాకు సీక్వెల్‌గా 'లక్కీ భాస్కర్ 2' ఖచ్చితంగా రాబోతోందని కన్ఫర్మ్ చేశాడు.

డైరెక్టర్ వెంకీ అట్లూరి గత ఏడాది దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'లక్కీ భాస్కర్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ కథ, దుల్కర్ నటన, వెంకీ డైరెక్షన్ ప్రేక్షకులను ఫిదా చేసాయి. ఇప్పుడు ఆయన కోలీవుడ్ స్టార్ సూర్యతో తన కొత్త ప్రాజెక్ట్.. షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి సంచలన విషయాలు షేర్ చేశాడు. 'లక్కీ భాస్కర్' సినిమాకు సీక్వెల్‌గా 'లక్కీ భాస్కర్ 2' ఖచ్చితంగా రాబోతోందని కన్ఫర్మ్ చేశాడు.

ఈ వార్త దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్‌కు పండగలా మారింది. ఎందుకంటే మొదటి పార్ట్‌లా ఈ సీక్వెల్ కూడా మరో బ్లాక్‌బస్టర్ అవుతుందనే ఆశలు భారీగా ఉన్నాయి. అయితే.. ధనుష్ నటించిన 'సార్' సినిమాకు మాత్రం సీక్వెల్ ఉండదని వెంకీ క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయం ధనుష్ ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించినా.. 'లక్కీ భాస్కర్ 2' వార్త అందరినీ ఎగ్జైట్ చేస్తోంది.' లక్కీ భాస్కర్ 2' ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

ఎందుకంటే.. వెంకీ అట్లూరి ప్రస్తుతం 'సూర్య 46' తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు దుల్కర్ సల్మాన్ కూడా తన ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. సో... ఈ సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది చూడాలి. అయితే, వెంకీ ట్రాక్ రికార్డ్, దుల్కర్ స్టార్ పవర్ చూస్తే, 'లక్కీ భాస్కర్ 2' మరో సెన్సేషనల్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. మరి ‘లక్కీ భాస్కర్ 2’ కోసం వెంకీ ఇంకెలాంటి స్కామ్ ప్లాన్ చేస్తాడో చూడాలి.

Tags

Next Story