వెంకీ షూట్ లో జాయిన్ అయ్యేది అప్పటి నుంచే !

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత.. విక్టరీ వెంకటేష్ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. అదే సమయంలో.. చిరంజీవి 157వ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’లో కూడా ఆయన భాగం కానున్నారు.
హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ భారీ ఎంటర్‌టైనర్ ఇప్పటికే హెడ్‌లైన్స్‌లో ఉంది. ‘కిష్కిందపురి’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి, వెంకటేష్ అక్టోబర్ నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్‌లో చేరనున్నట్లు వెల్లడించారు.
అనిల్ రావిపూడి వెంకటేష్ కోసం ఒక ఎక్సైటింగ్ రోల్‌ను రూపొందించారని, చిరంజీవితో కలిసి కొన్ని హై-ఎనర్జీ సీన్స్ కూడా ఉంటాయని టాక్. ఈ మాస్ మూమెంట్స్‌ను పెద్ద తెరపై చూడాలంటే అభిమానులు 2026 సంక్రాంతి వరకు వేచి ఉండాలి. అందాల నయనతార ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్‌గా నటిస్తుండగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో సమకూరుస్తున్నారు.
-
Home
-
Menu