త్రివిక్రమ్-వెంకటేష్ సినిమా షూటింగ్ మొదలు!

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ప్రధాన చిత్రీకరణ తాజాగా అధికారికంగా మొదలైంది. ఇది సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటికి 77వ చిత్రం. దాదాపు 20 నెలలుగా సినిమాలకి దూరంగా ఉన్న త్రివిక్రమ్... ముందుగా అల్లు అర్జున్‌తో చేయాలనుకున్న ప్రాజెక్ట్ జరగకపోవడంతో, ఇప్పుడు వెంకటేష్ సినిమాను మొదలు పెట్టారు. ఆ తర్వాత, 2026లో ఎన్టీఆర్‌తో పౌరాణిక చిత్రాన్ని ప్రారంభిస్తారు.
ఎస్. రాధా కృష్ణ 'హారిక & హాసిని క్రియేషన్స్' బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీని లాంఛింగ్ ఆగస్టులో జరగగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు సెప్టెంబర్‌లో పూర్తయ్యాయి. ఈ సినిమా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోంది. ఇందులో హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ మరియు త్రివిక్రమ్ ట్రేడ్‌మార్క్ పంచ్ డైలాగులు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది.
వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది. సహ నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ... 20 నెలల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ మళ్లీ సెట్‌లోకి రావడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
-
Home
-
Menu