వెంకటేష్ కొత్త సినిమా డీల్ ఫిక్స్?

వెంకటేష్ కొత్త సినిమా డీల్ ఫిక్స్?
X

వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం‘తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తెలుగులో మరే సీనియర్ హీరోకి సాధ్యం కాని రీతిలో ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను కొల్లగొట్టాడు. ఇప్పటికే ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం‘ అక్కడ రికార్డు వ్యూస్ ను దక్కించుకుంటుంది.

‘సంక్రాంతికి వస్తున్నాం‘ తర్వాత వెంకటేష్ ఏ సినిమా చేయబోతున్నాడు? అనే దానిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. అయితే రెండు, మూడు ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని ఆమధ్య వెంకీ స్వయంగా వెల్లడించాడు. లేటెస్ట్ గా వెంకటేష్.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

‘ఏజెంట్‘ చిత్రం డిజాస్టర్ తర్వాత ఇప్పుడు గ్రేట్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు సురేందర్ రెడ్డి. ఈకోవలోనే ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేశాడట. అది వెంకీకి బాగా నచ్చడం.. వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి నిర్మించనున్నాడట. మరి.. ఈ మూవీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

Tags

Next Story