వెంకటేష్ డేట్స్ ఇచ్చాడట !

వెంకటేష్  డేట్స్ ఇచ్చాడట  !
X
మెగా 157 లో వెంకటేష్‌ను స్పెషల్ గెస్ట్ రోల్ కోసం ఇన్వైట్ చేశాడట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. ఒక ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోంది.

విక్టరీ వెంకటేష్, అజేయ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటివరకూ మూడు సినిమాలు వచ్చాయి. ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” మూవీ అయితే బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా ఇద్దరి కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ మనీ-స్పిన్నర్‌గా నిలిచి, ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది. ఈ సక్సెస్ జోష్‌లోనే, వీళ్ల ఫ్రెండ్‌షిప్ మరింత స్ట్రాంగ్ అయింది.

ఈ కూల్ కెమిస్ట్రీ కారణంగానే, అనిల్ రావిపూడి తన లేటెస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ మెగా 157 లో వెంకటేష్‌ను స్పెషల్ గెస్ట్ రోల్ కోసం ఇన్వైట్ చేశాడట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. ఒక ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఫ్యాన్స్‌కి కూడా ఫుల్ కిక్ ఇచ్చే సినిమా ఇది. ఇటీవల ఈ సినిమా టీమ్ ముస్సోరీలో ఒక హై- ఎనర్జీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసింది. చిరంజీవి, నయనతార, కేథరిన్ ట్రెసాలు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు, అక్కడ సీన్స్ అదిరిపోయాయని టాక్.

ఇప్పుడు ఈ టీమ్ హైదరాబాద్‌లో నెక్స్ట్ ఫేజ్ షూటింగ్‌కి రెడీ అవుతోంది. ఇక్కడే వెంకటేష్ కూడా జాయిన్ కాబోతున్నాడట. ఈ స్పెషల్ రోల్ కోసం వెంకీ ఫుల్ గా ఒక నెల టైమ్ కేటాయించాడట. అంటే ఈ క్యారెక్టర్ ఓ రేంజ్‌లో ఉండబోతుందని అర్థం. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక, వెంకటేష్ తన నెక్స్ట్ మూవీ కోసం డైరెక్టర్ త్రివిక్రమ్‌తో జత కడతాడు. త్రివిక్రమ్-వెంకీ కాంబో అంటే ఫ్యాన్స్‌కి ఎప్పుడూ స్పెషల్ కదా, ఇది కూడా బిగ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది.

వెంకటేష్ గతంలో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేశాడు, కానీ చిరంజీవితో ఇంత వరకూ స్ర్కీన్ షేర్ చేసుకోలేదు. అయితే గతంలో వెంకీ ‘త్రిమూర్తులు’ మూవీలో చిరు ఒక పాటలో కనిపిస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద చూడటం ఫ్యాన్స్‌కి ఒక విజువల్ ట్రీట్ అవుతుంది. మెగా ఫ్యాన్స్, వెంకీ ఫ్యాన్స్ అంతా ఈ మూమెంట్ కోసం సూపర్ ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని అంతా ఫీల్ అవుతున్నారు.

Tags

Next Story