‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ బిగిన్స్!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ బిగిన్స్!
X
ఈ రోజు హైదరా బాద్‌లో ఫిల్మ్ రోల్ కెమెరా ఆన్ అయ్యింది. హైదరాబాద్‌లోని అల్యూ మినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జోరుగా షురూ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి పండగలాంటి అప్‌డేట్. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ఫైనల్‌గా స్టార్ట్ అయింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే జూన్ సెకండ్ వీక్‌లో షూటింగ్ మొదలవుతుందని చెప్పినట్టుగానే, ఈ రోజు హైదరా బాద్‌లో ఫిల్మ్ రోల్ కెమెరా ఆన్ అయ్యింది. హైదరాబాద్‌లోని అల్యూ మినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జోరుగా షురూ అయ్యింది.

ఈ షెడ్యూల్ దాదాపు ఒక నెల పాటు సాగనుందని ఇన్‌సైడ్ టాక్. ఈ టైంలో పవన్ కళ్యాణ్ తన పార్ట్‌లో చాలా వరకు సీన్స్‌ని కంప్లీట్ చేయబోతున్నారట. హరీష్ శంకర్, పవన్ కాంబో అంటేనే ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఈ సినిమాలో పవన్‌ని ఎలాంటి డిఫరెంట్ అవతార్‌లో చూపించబోతున్నారు? కథని ఎలా మలిచారు? అనేది ఇప్పుడు అందరి ఫోకస్. ఈ మూవీ ఫుల్-ఆన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని, పవన్ ఎనర్జీ స్క్రీన్‌పై బ్లాస్ట్ అవుతుందని అంటున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా యంగ్ అండ్ టాలెంటెడ్ శ్రీలీల నటిస్తోంది. ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పవన్‌తో స్క్రీన్ షేర్ చేయడం ఖచ్చితంగా హైలైట్ కానుంది. ఇంకా చాలా మంది ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించ బోతున్నారు, అయితే వాళ్ల డీటెయిల్స్ ఇంకా సస్పెన్స్‌లోనే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ బిగ్ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. దీంతో ఆడియో ఆల్బమ్ కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

Tags

Next Story