శరవేగంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం గ్రాండ్‌గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ హరీష్ శంకర్ తన మార్క్ స్పీడ్‌తో, బ్రేక్‌లు లేకుండా సీన్స్‌ను ఒకదాని తర్వాత ఒకటి షూట్ చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా సెట్స్‌పై టీమ్ అంతా సూపర్ ఎనర్జీతో, క్లాక్‌వర్క్ ప్రెసిషన్‌తో వర్క్ చేస్తోంది. రీటేక్‌లు అనవసరంగా తీసుకోకుండా, టైమ్ సేవ్ చేస్తూ, ప్రొడక్షన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు.
పవన్ కళ్యాణ్ సెట్ చేసిన స్ట్రిక్ట్ షెడ్యూల్, టైట్ డెడ్‌లైన్స్‌తో టీమ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఫుల్ డెడికేషన్‌తో షూటింగ్‌ను స్మూత్‌గా కంప్లీట్ చేసే దిశగా మూవ్ అవుతోంది. హరీష్ శంకర్ తన ఫాస్ట్-పేస్డ్ డైరెక్షన్ స్టైల్‌తో, సినిమాను టైమ్‌లో మాత్రమే కాకుండా.. క్వాలిటీలో కూడా టాప్-నాచ్‌గా డెలివర్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. సెట్స్‌పై ఎనర్జీ, ఎఫిషియెన్సీ చూస్తే, ఈ ప్రాజెక్ట్ ఎంత గ్రాండ్‌గా ఉండబోతోందో అర్థం అవుతుంది!
పవన్ కళ్యాణ్‌ను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై యాక్షన్ అవతార్‌లో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అంచనాలు ఆల్రెడీ స్కై-హై లెవెల్‌లో ఉన్నాయి, సోషల్ మీడియాలో హైప్ మామూలుగా లేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల జోడీ కడుతోంది. ఆమె ఎనర్జీ, చార్మ్ సినిమాకు ఎక్స్‌ట్రా కిక్ ఇవ్వబోతున్నాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
-
Home
-
Menu