అమెరికాలో ‘ఉస్తాద్’ కు అదిరిపోయే డిమాండ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అది కూడా కేవలం రెండు నెలల వ్యవధిలోనే. వరుసగా విడుదలైన “హరి హర వీర మల్లు”, “ఓజీ” సినిమాల్ని అమెరికాలో ఒకే డిస్ట్రిబ్యూటర్ విడుద చేశాడు. అయితే.. మొదటి చిత్రం ఆశించిన స్థాయిలో నిలవకపోగా, ఘోరంగా విఫలమై భారీ నష్టాలను మిగిల్చింది.
ఆ అనుభవం తర్వాత, అదే డిస్ట్రిబ్యూటర్ “ఓజీ” హక్కులను చాలా తక్కువ ధరకు సొంతం చేసుకున్నారు. “కనీసం రెండు మిలియన్ల వసూళ్లు వస్తే సరిపోతుంది” అని భావించిన ఆయన ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చి ఆశ్చర్యపోయారు. “ఓజీ” అమెరికాలో 5.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి, బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి ఎక్స్ ట్రాగా 2.5 మిలియన్ డాలర్లు లాభాలను తెచ్చిపెట్టింది.
దీంతో “హరి హర వీర మల్లు” వల్ల వచ్చిన నష్టాలను పూర్తిగా తుడిచేసి, పైగా లాభాల బాటలోకి నడిపింది “ఓజీ”. ఒకే హీరో సినిమాలతో లాభనష్టాల సమీకరణ సెట్ అయిపోయిన ఈ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” మీద విశేషమైన నమ్మకం పెంచుకున్నారు.
అమెరికాలో “ఓజీ” సాధించిన ఈ ఘన విజయంతో, పవన్ కళ్యాణ్ మార్కెట్ మళ్లీ రీబూస్ట్ అయింది. ఇప్పుడు అందరి దృష్టీ ఆయన తదుపరి బ్లాక్‌బస్టర్‌పై ఉంది. “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఇదే రీతిలో వసూళ్ల సునామీ సృష్టిస్తుందేమో అన్న ఆసక్తి పెరిగింది.
-
Home
-
Menu