మరో పాట కోసం ప్రయత్నాల్లో ఊర్వశి రౌతేలా

భారతీయ సినీ పరిశ్రమలో అగ్రతారలతో పోటీ పడే స్థాయిలో ఊర్వశి రౌతేలాకు అవకాశాలు రావడం లేదు. టాప్ ఫిల్మ్‌మేకర్స్ నుంచి లీడ్ రోల్స్‌కు అవకాశం దక్కడం అరుదుగా జరుగుతుంటుంది. అయినా ఊర్వశి మాత్రం తనకు క్రేజ్ ఎక్కువని.. సోషల్ మీడియాలో తన పాపులారిటీ అదిరిపోయే స్థాయిలో ఉందని చెప్పుకోవడం మానడం లేదు.
అందుకే ఆమె తన పాత చిత్రాల్లో నటించిన హీరోలు, డైరెక్టర్లతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటూ.. మరోసారి స్పెషల్ సాంగ్ అవకాశం దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. తాజాగా ఆమె నందమూరి బాలకృష్ణను మరో పాట కోసం అడిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల విడుదలైన "డాకూ మహారాజ్" చిత్రంలో ఊర్వశి రౌటేలా చేసిన “డబిడి డబిడి” పాటలోని నృత్యభంగిమలు విమర్శలకు గురైనప్పటికీ.. ఊర్వశి మాత్రం అది వైరల్ అయిందని అభిప్రాయపడుతోంది.
దాంతో, బాలయ్య నటించనున్న ‘అఖండ 2’ లో లేదా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న తదుపరి సినిమాలో ఆమెకు మరో స్పెషల్ సాంగ్ అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన "జాట్" చిత్రంలో కూడా ఊర్వశి “సారీ బోల్” పాటలో నటించింది. మరి ఇప్పుడు ప్రత్యేక గీతాలపై ఆశలు పెట్టుకున్న ఊర్వశికి టాప్ హీరోల సహకారం ఎంతవరకు లభిస్తుందో చూడాలి.
-
Home
-
Menu