షూటింగ్ లో జాయిన్ అయిన ‘ఆంధ్రా కింగ్’

షూటింగ్ లో జాయిన్ అయిన ‘ఆంధ్రా కింగ్’
X
ఉపేంద్ర తాజాగా రామ్ పోతినేని మెయిన్ లీడ్ లో “ఆంధ్రా కింగ్ తలూకా” అనే చిత్రం షూటింగ్ లోకి చేరారు. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు.

కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు టాలీవుడ్ కొత్తేమీ కాదు. తనదైన తనదైన స్టైల్లో గతంలో పలు తెలుగు చిత్రాల్లో హీరోగా, కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. కొంతకాలం విరామం తర్వాత.. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తూ అభిమానులను ఆకట్టుకోనున్నారు.

ఉపేంద్ర తాజాగా రామ్ పోతినేని మెయిన్ లీడ్ లో “ఆంధ్రా కింగ్ తలూకా” అనే చిత్రం షూటింగ్ లోకి చేరారు. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ గతంలో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన సంస్థ కావడంతో, ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.

“ఆంధ్రా కింగ్ తలూకా” కథ అభిమాన సంస్కృతి చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రంలో ఉపేంద్ర సూర్య కుమార్ అనే సినీ స్టార్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర ఒక గ్లామరస్, ప్రభావవంతమైన సినిమా తారగా ఉంటుందని, ఆయన నటనకు పూర్తి స్కోప్ ఉన్న పాత్రగా ఉంటుందని తెలుస్తోంది. రామ్ పోతినేని ఈ చిత్రంలో సూర్య కుమార్ డైహార్డ్ ఫ్యాన్‌గా నటిస్తున్నారు. రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఈ పాత్రలో జీవం పోస్తారని అంచనా. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. సినిమాకు సంగీతం తమిళ సంగీత ద్వయం వివేక్–మెర్విన్ అందిస్తోంది.

Tags

Next Story