భగత్ సింగ్ భవితవ్యంపై అనిశ్చితి!

పవన్ కళ్యాణ్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కారణంగా, ఈ ప్రాజెక్ట్‌పై ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించే అవకాశం తక్కువగా ఉన్నట్లు సమాచారం.
కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిన ఈ సినిమా, ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగడంపై స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో రెండు భారీ ప్రాజెక్టులు 'హరిహర వీరమల్లు, ఓజీ' చిత్రాలు మాత్రం ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న 'హరిహర వీరమల్లు' మే 9న విడుదలకు ముస్తాబవుతుంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ లో సుజీత్ రూపొందిస్తున్న 'ఓజీ' చిత్రం ఈ ఏడాది ద్వితియార్థంలో రానుంది. ఈ రెండు సినిమాలూ రెండు పార్టులుగా రూపొందుతుండడం విశేషం.
ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు కేటాయించే సమయం తక్కువగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పునరుద్ధరణపై ఆశలు పెట్టుకున్నా, పవన్ కి ఉన్న ప్రస్తుత రాజకీయ కమిట్‌మెంట్స్ దృష్ట్యా 'ఉస్తాద్ భగత్ సింగ్' సాగుతుందా లేదా ఆగిపోతుందా అన్నది అనిశ్చితంగా మారింది.
-
Home
-
Menu