ఈ వార్తల్లో నిజానిజాలేంటి?

"యానిమల్" సినిమా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా "స్పిరిట్" స్క్రిప్ట్‌పై వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ హై-బడ్జెట్ మూవీలో ప్రభాస్ హీరోగా, తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. "విజార్డ్ ఆఫ్ వర్డ్స్" త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు రిషి మనోజ్, "స్పిరిట్" సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాడని టాక్.
ఈ రూమర్ సోషల్ మీడియాలో జోరుగా సర్క్యులేట్ అవుతోంది. సందీప్ వంగా నుంచి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. రిషి ఇప్పటికే "నిశాచరుడు" అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి, డైరెక్ట్ చేశాడు. అలాగే, "స్టాగ్నేషన్" అనే మరో షార్ట్ ఫిల్మ్‌కి అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశాడు. ఇంతకుముందు.. రవితేజ కొడుకు మహాధన్ కూడా "స్పిరిట్" కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాడని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.
భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్‌తో కలిసి ఈ సినిమాని గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని సెప్టెంబర్ 2025లో లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ మరోసారి సందీప్‌తో జతకడుతున్నాడు.
-
Home
-
Menu