టాలీవుడ్ లో విషాదం – యువ నిర్మాత అకాలమరణం!

టాలీవుడ్ లో విషాదం – యువ నిర్మాత అకాలమరణం!
X


తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌కు చెందిన యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి ఆకస్మికంగా కన్నుమూశారు. మంగళవారం దుబాయ్ లో గుండెపోటుతో మరణించినట్లు అధికారికంగా వెల్లడించబడింది. ఈ వార్త టాలీవుడ్ వర్గాలను, ఆయన సన్నిహితులను తీవ్ర విషాదంలో ముంచేసింది.

కేదార్ సెలగంశెట్టి సినీ పరిశ్రమలోకి బన్నీ వాసు ప్రోద్బలంతో ప్రవేశించారు. ప్రారంభంలో "ముత్తయ్య" అనే సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన ఆయన, అనంతరం ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన "గం గం గణేశా" చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆయనకు నిర్మాతగా మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమాను నిర్మించేందుకు కేదార్ సిద్ధమయ్యారు. కేదార్ సెలగంశెట్టి దుబాయ్ వెళ్లడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story