ఈ రెండు సినిమాలకూ బాక్సాఫీస్ వద్ద తిరుగే లేదు !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న "పెద్ది" అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రం 2026 మార్చి 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనికి బుచ్చిబాబు సానా దర్శకుడు. ‘పెద్ది’ మూవీకి ఒక వారం ముందు.. మార్చి 19న కన్నడ రాక్ స్టార్ యశ్ నటించిన "టాక్సిక్" సినిమా.. థియేటర్స్ లోకి రానుంది. ఈ రెండు చిత్రాలూ 2026లో ఉగాది, ఈద్ పండుగల్ని టార్గెట్ చేసుకొని భారీ వసూళ్ళు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ రెండు సినిమాల విడుదల తేదీలు ఖరారైన తర్వాత.. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తన "లవ్ అండ్ వార్" సినిమా విడుదల తేదీని మార్చాలని నిర్ణయించారు. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ నటించిన ఈ చిత్రం 2026 మే 21న కాకుండా, మరో తేదీకి మారనుంది. దీంతో "పెద్ది", "టాక్సిక్" సినిమాలకు ఇతర చిత్రాలతో పోటీ ఉండదు. ఇది ఈ రెండు సినిమాలకూ మరింత అడ్వాంటేజ్ కాబోతోంది.
నాని నటించిన "ది ప్యారడైస్" సినిమా కూడా విడుదల తేదీని మార్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం "హిట్ 3" ప్రమోషన్‌లో ఉన్న నాని, తన "ప్యారడైస్" మూవీ, రామ్ చరణ్ "పెద్ది" రెండూ పాన్-ఇండియా సినిమాలని, రెండూ కలిసి విజయం సాధించవచ్చని అన్నారు. "రెండు సినిమాలూ బ్లాక్‌బస్టర్‌లు కావాలని కోరుకుంటున్నా," అని ఆయన అన్నారు. పోటీని స్వాగతిస్తానని, "పెద్ది" కోసం తేదీ మార్చే ఆలోచన లేదని చెప్పారు. అయితే, సమాచారం ప్రకారం, నాని చివరికి "పెద్ది" సినిమాకు దారి ఇవ్వడానికి "ది ప్యారడైస్" విడుదల తేదీని మార్చవచ్చని అంటున్నారు.
-
Home
-
Menu