ఈ మూవీలో క్రేజీ మలయాళ యాక్టర్స్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక భారీ యాక్షన్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 2026 వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' లాంటి హిట్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాకు మరింత హైపు క్రియేట్ అయింది.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ హాట్ టాపిక్ వైరల్ అవుతోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. వీళ్లిద్దరూ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారని, ప్రశాంత్ నీల్ వాళ్లను గట్టిగా చూపిస్తాడని చెప్పారు. పృథ్వీరాజ్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ న్యూస్ తెలుగు, మలయాళ సినిమా ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.
ఎన్టీఆర్, టొవినో, బిజు మీనన్ కలిసి నటించడం అరుదైన కాంబో. ఈ స్టార్స్ ఒకే స్క్రీన్‌పై ఎలా కనిపిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్‌లో ఇంటెన్స్ సీన్స్, గట్టి డ్రామా ఉంటాయని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాని ఎన్టీఆర్-నీల్ అని పిలుస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఇంత పెద్ద కాస్ట్, బలమైన డైరెక్టర్‌తో ఈ సినిమా రాబోయే ఏళ్లలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అధికారిక టైటిల్, టీజర్ కోసం అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
-
Home
-
Menu