హీరోగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్

కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులు నటులుగా మారుతున్న ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిన తాజా పేరు 'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడు అబిషన్ జీవింత్. తాజా సమాచారం ప్రకారం.. అబిషన్ 'కరెక్టెడ్ మచ్చి' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం.
ఈ సినిమాకు 'టూరిస్ట్ ఫ్యామిలీ' కి కో-డైరెక్టర్‌గా పనిచేసిన అబిషన్ అసోసియేట్ దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమాలో మాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తుందని టాక్. 'సూపర్ శరణ్య, థగ్స్, నేరు, వ్యసనసమేతం బంధుమిత్రాధిగల్’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన అనస్వర.. ఇప్పుడు తమిళ సినిమాల్లో క్రమంగా తన స్థానం సుస్థిరం చేసుకుంటోంది.
అబిషన్‌తో పాటు, తమిళ దర్శకులు నటన వైపు అడుగులు వేస్తున్న వారిలో ఇటీవల ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే'తో నటుడిగా సక్సెస్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే, లోకేష్ కనగరాజ్ కూడా నటనలోకి రాబోతున్నట్లు చెప్పాడు. కానీ అతని డెబ్యూ ఇంకా జరగలేదు.'కరెక్టెడ్ మచ్చి' సినిమా జానర్, కథాంశం వంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ మొదలవనుంది, మిగతా తారాగణం, టెక్నికల్ టీమ్ వివరాలు రాబోయే వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది.
-
Home
-
Menu