గ్లోబల్ మార్కెట్ పై కన్నేశారు !

దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తన తదుపరి భారీ చిత్రం “గ్లోబ్‌ట్రాటర్”తో గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- తమిళ డైరెక్టర్ అట్లీ కలిసి టాలీవుడ్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసు కెళ్లేందుకు ఒక భారీ సై-ఫై చిత్రంతో సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం హాలీవుడ్ స్టార్‌ను తీసుకురావాలని అట్లీ ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఈ సినిమా రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.
రాజమౌళి “గ్లోబ్‌ట్రాటర్” కోసం సంప్రదించిన అదే హాలీవుడ్ మార్కెటింగ్ ఏజెన్సీతో ఈ టీమ్ కూడా చర్చలు జరుపుతోంది. ఇక అల్లు అర్జున్-అట్లీ చిత్రాన్ని అంతర్జాతీయ రిలీజ్‌గా ప్లాన్ చేశారు. జపనీస్, స్పానిష్ సహా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్- డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలిసి “స్పిరిట్” అనే హై-వోల్టేజ్ కాప్ డ్రామాపై వర్క్ చేస్తున్నారు. సౌత్ కొరియన్ స్టార్ డాన్ లీ ఈ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం ఉందని బజ్. ఈ సినిమాని కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు, తద్వారా దీని గ్లోబల్ రీచ్‌ని విస్తరించాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం, “గ్లోబ్‌ట్రాటర్”, అల్లు- అట్లీ మూవీ, “స్పిరిట్” అనే మూడు తెలుగు భారీ చిత్రాలు తమ అంతర్జాతీయ లక్ష్యాలను అధికారికంగా ప్రకటించాయి. అంతేకాదు.. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న “డ్రాగన్” కూడా ఈ లిస్ట్‌లో చేరే అవకాశం ఉందని టాక్. అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రం “వార్ 2” బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇంత భారీ బడ్జెట్‌లతో ఈ చిత్ర నిర్మాతలు అంతర్జాతీయ మార్కెట్‌లే తమ ఇన్వెస్ట్‌మెంట్‌కి తగిన రిటర్న్స్ ఇస్తాయని గ్రహించారు. బాలీవుడ్ కనీసం పాన్-ఇండియన్ రీచ్ సాధించడానికి కష్టపడుతున్న ఈ సమయంలో, తెలుగు ఫిల్మ్‌మేకర్స్ మరియు స్టార్స్ గ్లోబల్ స్టేజ్‌ని టార్గెట్ చేస్తూ పెద్దగా ఆలోచిస్తున్నారు. ఈ ధైర్యమైన ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆశిద్దాం.
-
Home
-
Menu