ఛావా' తెలుగు ట్రైలర్ కి టైమ్ ఫిక్స్!

X
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో, లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఛావా’ ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. మరాఠా సామ్రాజ్య వీరుడు శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ నిర్మించారు.
తాజాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ‘ఛావా’ పేరుతోనే తెలుగు ప్రేక్షకులకు అందించబోతుంది. మార్చి 7న తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. తాజాగా, తెలుగు ట్రైలర్ విడుదల తేదీని కూడా ఖరారు చేసింది. మార్చి 3న ఉదయం 10 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Next Story
-
Home
-
Menu