రీ-రిలీజ్ అంటే నాకు గుర్తొచ్చేది ‘తొలిప్రేమ’ – దిల్ రాజు

X
టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ ఊపందుకుంటోంది. గతంలో బిగ్ హిట్ అయిన సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తుండటంతో, ప్రొడ్యూసర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈకోవలోనే 2013 సంక్రాంతికి విడుదలైన వెంకటేష్-మహేష్ బాబు మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మార్చి 7న రీ రిలీజవుతుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు రీ-రిలీజ్ కాన్సెప్ట్ గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘రీ-రిలీజ్ అంటే నాకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారి 'తొలిప్రేమ' అని అన్నారు. ‘అప్పట్లో మాకు ఐదేళ్ల హక్కులు ఉండేవి. వేరే సినిమా నష్టపోతే, 'తొలిప్రేమ' రీ-రిలీజ్ చేసేవాళ్ళం. నాలుగో రీ-రిలీజ్‌లో ₹12 లక్షల షేర్ వచ్చింది‘ అని తెలిపారు.
Next Story
-
Home
-
Menu