‘కాంతార’ థియేటర్స్ లో ‘ది రాజా సాబ్’ ట్రైలర్

‘కాంతార’ థియేటర్స్ లో ‘ది రాజా సాబ్’ ట్రైలర్
X
ఈ ట్రైలర్ అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతున్న.. "కాంతారా చాప్టర్ 1" తో పాటు బిగ్ స్ర్కీన్ పై ప్రీమియర్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రింట్‌లకు ట్రైలర్‌ను జతచేయనున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటింగ్ చిత్రం "ది రాజా సాబ్". ఈ మూవీ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ ట్రైలర్ హారర్-కామెడీ ప్రపంచాన్ని.. అందులోని థ్రిల్ ను తెరపై ఆవిష్కరించబోతోంది. ఈ ట్రైలర్ అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతున్న.. "కాంతారా చాప్టర్ 1" తో పాటు బిగ్ స్ర్కీన్ పై ప్రీమియర్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రింట్‌లకు ట్రైలర్‌ను జతచేయనున్నారు.

"కాంతారా చాప్టర్ 1" ను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్, ప్రభాస్‌తో ప్రత్యేకంగా మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకుంది. అందుకే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన "ది రాజా సాబ్" ట్రైలర్‌ను జతచేయడానికి ఈ నిర్మాణ సంస్థ అంగీకరించింది.

మారుతి దర్శకత్వం వహించిన "ది రాజా సాబ్" లో ప్రభాస్ సరదా పాత్రలో కనిపించనున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముగ్గురు కథానాయికలు గ్లామర్‌ను అద్దనున్నారు. ఇది అభిమానులకు కనువిందు కానుంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం నుండి మొదటి పాట కూడా వచ్చే నెలలో విడుదల కానుంది.

Tags

Next Story