‘ది రాజా సాబ్’ విడుదల తేదీ ఇదేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అదిరిపోయే సినిమాల లైనప్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ రెబల్ స్టార్ వివిధ సినిమా షెడ్యూల్స్ మధ్య ఊపిరిసలపని విధంగా షూటింగ్‌లతో బిజీగా గడుపుతూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాడు. అతని రాబోయే ప్రాజెక్ట్‌లలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ ఒకటి. ఈ సినిమా గురించి నిర్మాతలు ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ ఇవ్వకపోయినప్పటికీ, సినిమా విడుదల తేదీ గురించి లేటెస్ట్ ఇన్ఫో తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం.. ‘ది రాజా సాబ్’ చిత్రం విడుదల తేదీని డిసెంబర్ 5, 2025గా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ వార్త సినిమాపై మరోసారి హైప్‌ను పెంచింది. అయితే ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై ఖచ్చితమైన ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.. ఎందుకంటే ఇది ప్రభాస్‌ను ఒక సరికొత్త రొమాంటిక్ హారర్ కామెడీ జానర్లో చూసే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఇక ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తుండగా.. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సినిమాకు మరో ఆకర్షణగా నిలవనుంది. సంజయ్ దత్తో ప్రభాస్ తలపడే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ‘ది రాజా సాబ్ ’ మూవీ ఏ రేంజ్ సినిమా అవుతుందో చూడాలి.
-
Home
-
Menu