మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్న మాస్ డైరెక్టర్!

మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్న మాస్ డైరెక్టర్!
X

సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వినయ్.. ఆమధ్య అనారోగ్య కారణాలతో సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా విక్టరీ వెంకటేష్ తో వినాయక్ ఓ సినిమా చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

ఇప్పటికే వెంకీ కూడా వినయ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. వెంకీ-వినాయక్ కాంబో మూవీని నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నాడట. ఈ ముగ్గురూ గతంలో ‘లక్ష్మీ’ వంటి సూపర్ హిట్ మూవీ అందించారు. మళ్లీ దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి కలయిక సెట్ అవుతుండడం ఆసక్తికరంగా మారింది.

తన రీ-ఎంట్రీ మూవీని హిట్ చేయాలనే కసితో వినాయక్ ఉన్నాడట. తన మార్క్ మాస్ ఎలివేషన్స్ తో వెంకటేష్ కి సరిపడ కథను సిద్ధం చేస్తున్నాడట. ఈ కాంబోపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వెంకటేష్ ఇప్పటివరకూ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు.

Tags

Next Story