రామ్ సినిమాలో అతిథిగా ఆ స్టార్ హీరో?

రామ్ సినిమాలో అతిథిగా ఆ స్టార్ హీరో?
X

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం తన 22వ సినిమాతో బిజీగా ఉన్నాడు. గత కొన్ని చిత్రాలుగా హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రెచ్చిపోయిన రామ్.. ఈ సినిమా కోసం పూర్తిగా క్లాస్ లుక్ లోకి మారిపోయాడు. ఈ మూవీలో సాగర్ పాత్రలో క్యూట్ బాయ్ గా మెస్మరైజ్ చేయబోతున్నాడు.

రామ్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఆమె మహాలక్ష్మి పాత్రలో కనిపించబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ పి. మహేశ్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది.

లేటెస్ట్ గా రామ్ 22వ సినిమా కథకు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ స్టోరీ సినిమా ఇండస్ట్రీ ఇతివృత్తంతోనే సాగనుందట. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఆ క్యారెక్టర్ ను వెంకటేష్ చేయనున్నాడనే ప్రచారమూ ఉంది. సినిమాలోనూ విక్టరీ వెంకటేష్ గానే గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడట వెంకీ. గతంలో వెంకటేష్, రామ్ కలిసి ‘మసాలా‘ సినిమాలో నటించారు. మొత్తంగా.. రామ్ మూవీలో వెంకీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

Tags

Next Story