గోవాలో తెలుగు నిర్మాత ఆత్మహత్య

గోవాలో తెలుగు నిర్మాత ఆత్మహత్య
X
ఈ ప్రొడ్యూసర్ కోలీవుడ్ లో రజినీకాంత్ కబాలి ని తెలుగులో డబ్ చేశారు. అలాగే, ‘గణితన్’ అనే చిత్రాన్ని కూడా తమిళంలో నిర్మించారు.

టాలీవుడ్ లో తాజాగా ఒక విషాదం చోటు చేసుకుంది. గోవాలో కేపీ చౌదరి అనే నిర్మాత ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయన రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు. జీవితంలో పూర్తి స్థాయిలో భంగపడి.. డ్రగ్స్ దందా ద్వారా సంపాదించిన డబ్బుతో సినిమా నిర్మాణం చేయాలని ఆశించి.. అది విఫలమైన వ్యక్తిగా తెలుస్తోంది.

ఈ ప్రొడ్యూసర్ కోలీవుడ్ లో రజినీకాంత్ కబాలి ని తెలుగులో డబ్ చేశారు. అలాగే, ‘గణితన్’ అనే చిత్రాన్ని కూడా తమిళంలో నిర్మించారు. పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ , మహేష్ బాబు, వెంకటేష్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశారు.

కేపీ చౌదరిది ఖమ్మం జిల్లా. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో త్వరగా పరిచయాలు పెంచుకున్న ఆయన.. డ్రగ్స్ వినియోగించేవాడని గతంలో పోలీసులు వెల్లడించారు. ఆయన ఇతర దేశాల నుంచి డ్రగ్స్ ను తీసుకురావడంలో నిపుణుడు కావడం వలన, 2023లో వంద ప్యాకెట్ల కొకెయిన్ తో హైదరాబాద్ లో పట్టుబడ్డారు. ఇటీవల కొంత కాలంగా.. ఆయన తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. గోవాలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.

Tags

Next Story