తమిళంలో రీమేక్ కాబోతున్న తెలుగు ‘కోర్ట్’ !

తమిళంలో రీమేక్ కాబోతున్న తెలుగు ‘కోర్ట్’ !
X
తమిళ యాక్టర్ ప్రశాంత్, ప్రియదర్శి పోషించిన పాత్రను తమిళ వెర్షన్‌లో పోషిస్తారు. కృతిక్, ఇనియా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తారు. కృతిక్ తమిళ నిర్మాత కదిరేసన్ కుమారుడు, ఇనియా నటి దేవయాని కూతురు.

నాచురల్ స్టార్ నానీ సపోర్ట్ చేసిన చిన్న బడ్జెట్ సినిమా ‘కోర్ట్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ కోర్ట్‌రూమ్ డ్రామాలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా.. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడం ఖాయమైంది. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయింది.

తమిళ వెటరన్ యాక్టర్ ప్రశాంత్, ప్రియదర్శి పోషించిన పాత్రను తమిళ వెర్షన్‌లో పోషిస్తారు. కృతిక్, ఇనియా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తారు. కృతిక్ తమిళ నిర్మాత కదిరేసన్ కుమారుడు, ఇనియా నటి దేవయాని కూతురు. సీనియర్ అడ్వకేట్‌గా సాయి కుమార్ పోషించిన పాత్రను త్యాగరాజన్ పోషిస్తారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలవుతుంది. త్వరలో మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు.

Tags

Next Story