తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన సినీ అవార్డులు – టాలీవుడ్ హర్షం

తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన సినీ అవార్డులు – టాలీవుడ్ హర్షం
X
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతిష్టాత్మక అవార్డులను తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించినట్లు ప్రకటించడంతో, పరిశ్రమ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతిష్టాత్మక అవార్డులను తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించినట్లు ప్రకటించడంతో, పరిశ్రమ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను గౌరవిస్తూ "గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్" (GTFA) పేరుతో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

ఈ అవార్డులలో ప్రముఖమైనవి:

NTR జాతీయ చలనచిత్ర అవార్డు

పైడి జైరాజ్ చలనచిత్ర అవార్డు

బి.ఎన్. రెడ్డి చలనచిత్ర అవార్డు

నాగిరెడ్డి మరియు చక్రపాణి చలనచిత్ర అవార్డు

కాంతారావు చలనచిత్ర అవార్డు

రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు

ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు) గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ.

తెలంగాణ ప్రభుత్వం ఈ పురస్కారాలను పునరుద్ధరించడం ద్వారా, రాష్ట్రంలో సినీ నిర్మాణ రంగానికి మరింత ఊతమిస్తూ, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేలా చేస్తున్నందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

Tags

Next Story