తాప్సీ ‘గాంధారి’ షూటింగ్ పూర్తి !

బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ .. తాప్సీ పన్ను రాబోయే సరికొత్త చిత్రం 'గాంధారి'. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది . ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేస్తూ, చిత్రబృందానికి సంబంధించిన కొన్ని చిత్రాలను అభిమానులతో పంచుకుంది.
"మానవ శరీరానికి యన్ ఓ యస్ మోడ్ ఉంటే.. నేను ఈ సినిమాలో దాన్ని అనుభవించాను. సంకల్పం, పట్టుదల అనే ఇంధనంతో నడిచే శక్తి ఉంటే.. నేను ఈ సినిమాలో చూశాను. ‘ఇది సాధించాలి’ అనే ఏకైక లక్ష్యంతో పని చేయడం అంటే ఏంటో.. నేను ఈ సినిమాలో అనుభవించాను. ప్రతి సారి నేను ప్రవాహానికి ఎదురీదాలని నిర్ణయించుకున్నప్పుడు.. దాని కోసం ఎంతటి మూల్యం చెల్లిస్తానో మరిచిపోతాను. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా శారీరక, మానసిక శ్రమ అనుభవించాను. కానీ కొన్ని గాయాలు మనసుకు తృప్తిని ఇస్తాయి. మేమంతా మన శక్తిని మొత్తం పెట్టాం. మా గాంధారి" సినిమాను మీ ముందుకు త్వరలోనే తీసుకువస్తున్నాం... అని తాప్సీ తన పోస్ట్‌లో పేర్కొంది.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. చిత్రబృందం సభ్యులతో కలిసి తాప్సీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తాప్సీ పాత్ర ఎలా ఉండబోతుందో ఇంకా గోప్యంగా ఉంచడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
'గాంధారి' చిత్రంతో పాటు, తాప్సీ ప్రస్తుతం 'ఓ లడ్కీ హై కహాన్?' చిత్రంలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రముఖ నిర్మాత సుభాష్ ఘాయ్ గతేడాది నవంబరులో 'అత్రాజ్ 2' గురించి ప్రకటించారు. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన 'అత్రాజ్' చిత్రానికి ఇది కొనసాగింపుగా రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ కోసం చిత్రబృందం తాప్సీ పన్నుని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, తాప్సీ ఇంకా ఒప్పందం కుదుర్చుకోలేదని, కానీ కథ తనకు నచ్చినట్లు తెలిసింది.
-
Home
-
Menu