యాక్షన్ అడ్వంచర్ చిత్రాల్లో నటించాలని ఉంది: తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా తన సుదీర్ఘ కెరీర్‌లో గ్లామరస్ ఎంటర్‌టైనర్‌ల నుండి “బాహుబలి” లాంటి పెద్ద పీరియడ్ బ్లాక్‌బస్టర్‌ల వరకు చాలా రకాల సినిమాలు చేసింది. రీసెంట్‌గా, ఆమె చేసిన మాంచి డ్యాన్స్ నంబర్లు, స్పెషల్ ఐటమ్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని.. పెద్ద హిట్స్ అయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ హీరోయిన్ తను ఇంతవరకూ ప్రయత్నించని కొత్త స్పేస్‌ని చూడాలని అనుకుంటోంది.
తనకి యాక్షన్, అడ్వెంచర్ సినిమాల్లో నటించాలని ఆసక్తిగా ఉందని.. ఎందుకంటే ఆ జానర్‌లను ఇండియన్ సినిమాల్లో ఇంకా సరిగ్గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు అని తమన్నా చెప్పింది. “కచ్చితంగా యాక్షన్ జానర్‌లో ఏదైనా చేయాలని నాకు చాలా కోరిక ఉంది,” అని ఆమె చెప్పింది. “అలాగే, ఒక అడ్వెంచర్ ఫిలిం కూడా చేయాలని ఉంది. మన దగ్గర ఆ జానర్‌ని పెద్దగా ఎవరూ టచ్ చేయలేదు అనుకుంటున్నాను, కానీ అలాంటి సినిమాలో నేను నటించాలని ఇష్టపడతాను.” అని తమ్మూ అంది.
తనకు ఉన్న అనుభవం, వర్సటైలిటీ తో, తన క్రియేటివ్ హద్దులను దాటి, ప్రేక్షకులను మళ్లీ ఒకసారి సర్ ప్రైజ్ చేయడానికి ఇదే సరైన సమయం అని తమన్నా నమ్ముతోంది. మరి తమన్నాతో ఏ దర్శకుడు అలాంటి యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తాడో చూడాలి.
-
Home
-
Menu