నేను ముందే ఎలాంటి ప్లాన్స్ వేసుకోను : తమన్నా భాటియా

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ.. తాను లైఫ్‌లో ఎప్పుడూ ప్రవాహంతో పాటే వెళ్తానని, ముందే ఏ ప్లాన్స్ వేసుకోనని చెప్పింది. ఈ పద్ధతి తన డేటింగ్ లైఫ్‌కి కూడా వర్తిస్తుందని హింట్ ఇచ్చింది. నవ్వుతూ, "నన్ను ఎక్కడికి వెళ్తానో అడగొద్దు.. కానీ జనరల్‌గా జరిగే విషయాలను అలాగే తీసుకునే పంథాని నేను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను" అని చెప్పింది.
రీసెంట్‌గా తమన్నా.. నటుడు విజయ్ వర్మతో రెండేళ్లకి పైగా రిలేషన్‌షిప్‌లో ఉండి బ్రేక్-అప్ అయ్యింది. ఈ విడిపోవడం తన రిలేషన్‌షిప్స్‌పై తన ఔట్‌లుక్‌ని మార్చిందని టాక్. సుమారు 16 ఏళ్ల కిందట తెలుగు సినిమాలో ఫేమస్ అయినప్పటి నుంచి తాను కంటిన్యూస్‌గా వర్క్ చేస్తున్నానని కూడా మెన్షన్ చేసింది. వర్క్‌హోలిక్ కావడం వల్ల.. వీకెండ్ యాక్టివిటీస్ లాంటివి ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదని చెప్పింది.
రజనీకాంత్ 'జైలర్'లో ఆమె చేసిన పాట సూపర్ హిట్ అయినప్పటికీ, జూన్ 2026లో రిలీజ్ అవ్వొచ్చని అనుకుంటున్న 'జైలర్ 2' సీక్వెల్‌లో ఆమె ఉంటుందో లేదో క్లియర్‌గా తెలీదు. తమన్నా ఇప్పుడు కొత్త తెలుగు సినిమాలకు సైన్ చేయడానికి వెయిట్ చేస్తోంది.
-
Home
-
Menu