ఆ విషయంలో అంత కోరికగా ఉందా?

ఆ విషయంలో అంత కోరికగా ఉందా?
X
‘తనకు ఎంతో ఇష్టమైన బయోపిక్ ఏదైనా ఉందంటే.. అది ప్రముఖ నటి శ్రీదేవి జీవిత కథే. శ్రీదేవి కెరీర్ మాత్రమే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మలుపులు ఉన్నాయి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన "మహానటి" చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మహానటి సావిత్రి జీవితాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు.. మరో లెజెండరీ నటీమణి బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు "మిల్కీ బ్యూటీ" తమన్నాతో ముడిపాటు ఉండడం విశేషం.

ఇటీవల ఓ మీడియాతో ఇంటరాక్షన్‌లో తమన్నాను ఒక బయోపిక్‌లో నటించాల్సి వస్తే ఎవరిది చేస్తారు? అని అడిగిన ప్రశ్నకు ఆమె వెంటనే సమాధానం ఇచ్చింది. ‘తనకు ఎంతో ఇష్టమైన బయోపిక్ ఏదైనా ఉందంటే.. అది ప్రముఖ నటి శ్రీదేవి జీవిత కథే. శ్రీదేవి కెరీర్ మాత్రమే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మలుపులు ఉన్నాయి. ఆమె జీవితం నిజంగా భావోద్వేగంతో నిండిన గొప్ప కథగా ఉంటుంది’ అని తమన్నా తన కోరికను బైట పెట్టింది.

శ్రీదేవి తన నటనా ప్రస్థానంలో మాత్రమే కాకుండా.. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఆసక్తికరమైన మలుపులను చూశారు. అంతేకాక, ఆమె మరణం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. హఠాన్మరణానికి గల కారణాలు ఇప్పటికీ అనేక రకాల వాదనలకు కేంద్ర బిందువుగా నిలిచాయి.

శ్రీదేవి బయోపిక్ రూపొందితే, అది ఖచ్చితంగా ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకునే చిత్రం అవుతుంది. కానీ.. ఈ ప్రాజెక్ట్‌ను నెరవేర్చడానికి బోనీ కపూర్ అంగీకారాన్ని పొందడం, అలాగే బయోపిక్ నిర్మాణానికి సంబంధించిన అనేక సవాళ్లు ఎదుర్కోవడం అవసరమవుతుంది. అయితే తమన్నా తన కోరికను వ్యక్తపరిచిన నేపథ్యంలో, ఎవరైనా ప్రతిభావంతులైన దర్శకుడు ముందుకు వచ్చి ఈ ప్రాజెక్ట్‌ను సాకారం చేస్తారా? అన్నది చూడాల్సిన విషయం.

Tags

Next Story