
నేను పెర్ఫెక్ట్ లైఫ్ పార్టనర్ ను అవ్వాలనుకుంటున్నాను : తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ మధ్య కాస్త లోతైన ఆత్మపరిశీలన మూడ్‌లో ఉన్నట్టుంది. తన లేటెస్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో షో “డు యు వాంట్ టు పార్టనర్” ప్రమోషన్స్‌లో.. సహ నటి డయానా పెంటీతో కలిసి, సినిమా గ్లామర్ ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే వ్యక్తిగత కోణాన్ని బయటపెట్టింది.
ఓ డీప్ కాన్వోలో తమన్నా ఇలా అంది.. “నేను ఒక అద్భుతమైన లైఫ్ పార్టనర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నా. అది ప్రస్తుతం నా లైఫ్ గోల్..” ఆమె కాస్త ఉల్లాసంగా, ఆత్మవిశ్వాసంతో ఇలా చెప్పింది, “నేను అలాంటి లైఫ్ పార్టనర్ కావాలను కుంటున్నాను, ఎవరో ఒకరు నన్ను పొందడం వాళ్ల పూర్వజన్మ పుణ్యమని ఫీల్ అయ్యేలా. ఆ లక్కీ పర్సన్ ఎవరైతేనేం, నేను దానికోసం గట్టిగా కష్టపడుతున్నా... పర్ఫెక్ట్ ప్యాకేజీ త్వరలోనే రాబోతోంది...”
ఈ ఏడాది ప్రారంభంలో తమన్నా.. నటుడు విజయ్ వర్మతో కొన్ని నెలల డేటింగ్ తర్వాత విడిపోయారు. ఈ నేపథ్యంలో, పర్ఫెక్ట్ లైఫ్ పార్టనర్ కావాలనే ఆమె తాజా కామెంట్స్ అందరి దృష్టినీ ఆకర్షించాయి.
-
Home
-
Menu