మళ్ళీ గ్లామర్ పాత్రలపైనే ఫోకస్ !

మళ్ళీ గ్లామర్ పాత్రలపైనే ఫోకస్ !
X
“ఓదెల 2” వంటి నాన్-గ్లామర్ పాత్రలు ఆమెకు మళ్లీ రావడం కష్టమే. ఎందుకంటే ఇండస్ట్రీలో ట్రెండ్‌లు, సెంటిమెంట్ల మీద ఎక్కువగా నమ్మకం ఉంటుంది.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవల తన కెరీర్‌లో తొలిసారి ఓ వినూత్నమైన జానర్‌ను ప్రయత్నించింది. తనపై ఉన్న ఫిక్స్‌డ్‌ ఇమేజ్‌ను మార్చాలని భావించిన ఆమె, “ఓదెల 2” లో నాగసాధువు పాత్రలో నటించింది. కానీ ఆశించిన ఫలితం రాలేదు. ప్రచార కార్యక్రమాల్లో భారీ హైప్ సృష్టించినప్పటికీ, “ఓదెల 2” సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు చేయలేకపోయింది. తర్వాత కూడా పికప్ కావడం లేదు. చివరికి ఈ సినిమా నిర్మాతలకు నిరాశనే మిగిల్చింది.

తమన్నా నటనకు కాకపోయినా, ఆమె లుక్‌కి, ప్రెజెన్స్‌కి మాత్రం మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ తమన్నా ఆశించినంతగా ఆ పాత్రతో కెరీర్ మలుపు తిరగలేదు. దీంతో మళ్లీ ఆమె గ్లామర్ పాత్రల వైపు తిరగాల్సి వచ్చింది. ఇటీవల తమన్నా బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “జైలర్” చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి “కావాలా” పాటలో చేసిన డ్యాన్స్ హావభావాలు యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాయగా.. “స్త్రీ 2” సినిమాలోని “ఆజ్ కి రాత్” పాటలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న “రైడ్ 2” చిత్రంలోనూ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.

ఇటీవలే విజయ్ వర్మతో తన రిలేషన్‌షిప్‌ ముగించుకున్న తమన్నా.. కొత్త సినిమాలు సైన్ చేయాలని ప్రయత్నిస్తోంది. కానీ ఇండస్ట్రీలోని ధోరణి ప్రకారం, “ఓదెల 2” వంటి నాన్-గ్లామర్ పాత్రలు ఆమెకు మళ్లీ రావడం కష్టమే. ఎందుకంటే ఇండస్ట్రీలో ట్రెండ్‌లు, సెంటిమెంట్ల మీద ఎక్కువగా నమ్మకం ఉంటుంది. ఈ నేపథ్యంలో, తమన్నా భవిష్యత్‌లో మళ్లీ గ్లామర్ పాత్రలతోనే కెరీర్ కొనసాగించాల్సి వస్తుందేమో అన్న భావన బలపడుతోంది.

Tags

Next Story