స్ట్రగుల్ అవుతున్న టాలెంటెడ్ డైరెక్టర్స్ !

ఒక్క ఫ్లాప్‌తో డైరెక్టర్ కెరీర్ కష్టాల్లో పడుతోంది. గతంలో హిట్‌లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఇప్పుడు నటులు, నిర్మాతలకు పెద్దగా పట్టడం లేదు. ఒకప్పుడు సూపర్ హిట్స్ ఇచ్చిన పలువురు టాలెంటెడ్ డైరెక్టర్లు ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాళ్ల స్థితిని ఓసారి చూద్దాం.
కొరటాల శివ
తెలుగు సినిమాలో టాప్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ కెరీర్‌లో 'ఆచార్య' ఫ్లాప్ ఓ పెద్ద దెబ్బ. 'దేవర'తో కాస్త ఊపిరి పీల్చుకున్నా, దాని సీక్వెల్ ఆగిపోయినట్టు టాక్. తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇంకా క్లారిటీ లేదు.
నందిని రెడ్డి
ఈ జనరేషన్‌లో తెలుగు సినిమాకి ఒకే ఒక్క లేడీ డైరెక్టర్. ఆమె చివరి సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్‌లపై వర్క్ చేస్తోంది. సమంతతో ఓ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
వంశీ పైడిపల్లి
మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్స్‌తో పనిచేసిన వంశీ, 'వారిసు' సినిమాతో విజయ్‌తో చేసిన ప్రయత్నం ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా విడుదలై రెండున్నర సంవత్సరాలు గడిచినా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ లేదు. ఆమిర్ ఖాన్‌తో సినిమా చేస్తాడని రూమర్స్ ఉన్నా, ఇంకా ధృవీకరణ రాలేదు.
ప్రశాంత్ వర్మ
'హనుమాన్' తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్. అయినా, దాదాపు ఏడాదిన్నర గడిచినా ప్రశాంత్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. జై హనుమాన్ అనౌన్స్ అయినా.. దాని గురించి అప్డేట్స్ రావడం లేదు .
తరుణ్ భాస్కర్
న్యూ ఏజ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటనపై ఫోకస్ చేసి డైరెక్షన్‌కు లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు. 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌తో తిరిగి రాబోతున్నాడు. కానీ విశ్వక్ సేన్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండడంతో ఈ సినిమా మొదలవడానికి టైమ్ పడుతుంది.
బలగం వేణు
కమెడియన్‌గా మొదలై 'బలగం'తో డైరెక్టర్‌గా అద్భుతమైన ఎంట్రీ ఇచ్చిన వేణు, రెండో సినిమా 'ఎల్లమ్మ' కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. స్టార్స్‌కు నెరేషన్ ఇచ్చినా, ఇంకా హీరో ఫైనల్ కాలేదు. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది క్లారిటీ లేదు.
సాగర్ చంద్ర
'భీమ్లా నాయక్' ఫేమ్ సాగర్ చంద్ర 'టైసన్ నాయుడు'తో బిజీగా ఉన్నాడు, కానీ ఈ ప్రాజెక్ట్ సంవత్సరాలుగా ఆలస్యమవుతోంది. ఇతర ప్రాజెక్ట్‌లు కూడా సెట్ కాలేదు. అతడి తదుపరి సినిమా 'టైసన్ నాయుడు' రిజల్ట్‌పై ఆధారపడి ఉంది.
-
Home
-
Menu