సుశాంత్ హారర్ థ్రిల్లర్ జర్నీ !

టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్, తన కెరీర్‌లో పూర్తి కొత్త జానర్‌ను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘యస్ ఏ 10’ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రానికి పృధ్విరాజ్ చిట్టేటి దర్శకత్వం వహిస్తుండగా... వరుణ్ కుమార్, రాజ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటి వరకు రొమాంటిక్ హీరోగా ప్రేక్షకులను అలరించిన సుశాంత్.. ఈసారి ఇంటెన్స్ లుక్‌లో, డార్క్ షేడ్ క్యారెక్టర్‌తో కనిపించనున్నాడు. లేటెస్ట్‌గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ముసురైన వాతావరణం, డీప్ కాన్సెప్ట్ సూచించే విజువల్స్, నీటిలో ప్రతిబింబంలా కనిపించే మిస్టీరియస్ ఎలిమెంట్ ఇవన్నీ సినిమాపై బోలెడంత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
హారర్ సినిమాల్లో విజువల్ ప్రెజెంటేషన్ కీలకమైన అంశం. ఈ సినిమాకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్యాక్‌డ్రాప్, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ అన్ని కలిపి సినిమాకి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇవ్వబోతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనుండడం విశేషం. ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. హారర్ థ్రిల్లర్ జానర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న ఈ మూవీ, మరిన్ని అప్‌డేట్స్‌తో ఇంకా ఆసక్తిని పెంచే అవకాశం ఉంది.
-
Home
-
Menu