టీవీ స్క్రీన్ పైనా సూపర్ హిట్!

వెంకటేష్, అనిల్ రావిపూడి హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా ఓటీటీ, టెలివిజన్ ప్లాట్‌ఫామ్‌లను కూడా షేక్ చేసింది.
మార్చి 1న జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారమైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ ప్రకటించిన సమాచారం ప్రకారం, ఈ సినిమా ఏకంగా 18.1 టీవీఆర్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఇది గత రెండేళ్లలో అత్యధిక టీవీఆర్ రాబట్టిన చిత్రంగా నిలిచిందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
టెలివిజన్ ప్రీమయర్ రోజునే ఈ సినిమా జీ5 వేదికగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ మొదలైంది. ఓటీటీలోనూ 310 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది. మొత్తంగా ‘సంక్రాంతికి వస్తున్నాం‘ థియేటర్, ఓటీటీ, టీవీ.. ఇలా అన్ని వేదికలపై హవా కొనసాగించిన చిత్రంగా నిలిచింది.
-
Home
-
Menu