సూపర్ హీరోలు వచ్చేస్తున్నారు !

సూపర్ హీరోలు వచ్చేస్తున్నారు !
X
ఇప్పటివరకు, ‘క్రిష్, హను-మాన్, మిన్నల్ మురళి’ వంటి భారతీయ సూపర్‌ హీరో సినిమాలు మనం చూశాం. ఇప్పుడు.. ఈ కాన్సెప్ట్‌తో రాబోతున్న మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి.

సూపర్‌హీరో సినిమాలు ఇటీవల ఇండియన్ స్ర్కీన్ పై ట్రెండ్‌గా మారుతున్నాయి, ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌తో చాలా కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటివరకు, ‘క్రిష్, హను-మాన్, మిన్నల్ మురళి’ వంటి భారతీయ సూపర్‌ హీరో సినిమాలు మనం చూశాం. ఇప్పుడు.. ఈ కాన్సెప్ట్‌తో రాబోతున్న మరికొన్ని సినిమాల గురించి చూద్దాం....


విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ను వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సామాన్యుడిగా కనిపించి నప్పటికీ, కొన్ని సూపర్‌హీరో ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

మిరాయ్

తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సూపర్‌హీరో సినిమా ‘మిరాయ్’ కు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. విలన్‌గా మంచు మనోజ్ కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

అల్లు అర్జున్ – అట్లీ సినిమా

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఓ సూపర్‌హీరో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో భారీ వీఎఫ్ఎక్స్ ఉంటుందని, అల్లు అర్జున్ మల్టిపుల్ పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. దీపికా పదుకొణె మొదటి హీరోయిన్‌గా ప్రకటించబడింది, మరియు జాన్వీ కపూర్, మృణాళ్ ఠాకూర్ కూడా ఈ చిత్రంలో ఉండవచ్చని వినికిడి.

ఆమిర్ ఖాన్ – లోకేష్ కనగరాజ్ సినిమా

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి సూపర్‌హీరో సినిమా కోసం జతకడుతున్నారు. ఆమిర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది.

క్రిష్ 4

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన సూపర్‌హిట్ సూపర్‌హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’ నాల్గవ భాగానికి దర్శకుడిగా మారనున్నారు. ‘క్రిష్ 4’ ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కావచ్చు. 2026 లేదా 2027లో విడుదల కావచ్చు.

వీటితో పాటు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘అధీర’, ‘మహాకాళి’, ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ రవితేజతో చేస్తున్న సినిమా, ‘శక్తిమాన్’ సినిమా అడాప్టేషన్, నివిన్ పాలీ నటిస్తున్న ‘మల్టీవర్స్ మన్మథన్’.. ఇంకా ఉన్ని ముకుందన్ టైటిల్‌ ఫిక్స్ చేయని సినిమా కూడా సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయో చూడాలి.

Tags

Next Story