‘అఖండ 2’ లో క్యామియోగా బాలీవుడ్ స్టార్ ?

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం "అఖండ" కు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం "అఖండ 2: తాండవం". ఈ సినిమా గురించి తాజా సమాచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో బాలీవుడ్ సూపర్‌స్టార్ సన్నీ డియోల్‌ను ఒక ప్రత్యేక గెస్ట్ రోల్ కోసం తీసుకోవాలని చిత్ర బృందం యోచిస్తోంది. ఇటీవల "జాట్" సినిమాతో ప్రేక్షకులను అలరించిన సన్నీ డియోల్, ఈ సినిమా షూటింగ్ సమయంలో తెలుగు సినిమా నిర్మాతలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు.
ఈ నేపథ్యంలో సన్నిడియోల్ "అఖండ 2"లో కామియో పాత్రలో కనిపించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. సన్నీ డియోల్ లాంటి బాలీవుడ్ హీరో ఈ చిత్రంలో భాగం కావడం వల్ల, హిందీ మార్కెట్‌లో సినిమాకు గట్టి పునాది ఏర్పడి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. "అఖండ 2" సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను మొదటి భాగాన్ని తలదన్నే రీతిలో, మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించాలని భావిస్తూ, దర్శకుడు ఇప్పటికే జార్జియా దేశానికి వెళ్లి అక్కడి లొకేషన్స్‌ను పరిశీలించారు. జార్జియాలోని సుందరమైన ప్రదేశాలు సినిమాకు అదనపు ఆకర్షణను తీసుకొస్తాయని చిత్ర బృందం ఆశిస్తోంది. ఈ సినిమా కథలో భక్తి పరమైన అంశాలు ప్రధానంగా ఉండటం వల్ల, హిందీ ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌ను రికవరీ చేయడానికి, హిందీ మార్కెట్‌లో సినిమాను విజయవంతం చేయడం కీలకమని గుర్తించారు. అందుకే సన్నీ డియోల్ లాంటి స్టార్‌ను ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలని నిర్ణయించారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!
-
Home
-
Menu