స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టబోతున్న సుకుమార్

స్క్రిప్ట్ వర్క్  మొదలు పెట్టబోతున్న సుకుమార్
X
జూన్ నుంచి సుకుమార్ తన తదుపరి సినిమాకు స్క్రిప్ట్ పనులను ప్రారంభించ నున్నాడని టాక్. ఈ సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటించనున్నాడు. ఇప్పటికే ఒక పాయింట్ సుకుమార్ దృష్టిలో ఉన్నప్పటికీ, దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ కొంతకాలంగా విరామం తీసుకుంటున్న విషయం తెలిసిందే. 2024 డిసెంబర్‌లో విడుదలైన “పుష్ప 2” అతడి దర్శక జీవితంలో అత్యంత భారీ విజయాన్ని సాధించిన చిత్రం. అయితే ఆ సినిమా విడుదల అనంతరం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన వల్ల సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరికీ తీవ్ర అసౌకర్యం కలిగింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కోసం రంగంలోకి దిగాడు. ఆ మూవీ అట్లీ దర్శకత్వంలో రూపొందనుంది. ఇక సుకుమార్ మాత్రం పూర్తిగా బ్రేక్ తీసుకుని.. తన భార్య, పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. మరో నెలరోజులు ఆయన విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

జూన్ నుంచి సుకుమార్ తన తదుపరి సినిమాకు స్క్రిప్ట్ పనులను ప్రారంభించ నున్నాడని టాక్. ఈ సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటించనున్నాడు. ఇప్పటికే ఒక పాయింట్ సుకుమార్ దృష్టిలో ఉన్నప్పటికీ, దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఆయన తన రచనా బృందంతో కలిసి బ్రెయిన్‌స్టార్మింగ్ సెషన్లు నిర్వహిస్తూ, వాళ్ల సూచనలు, సన్నివేశాలు కూడా ఆలోచనలోకి తీసుకోనున్నాడు. ఈ ప్రక్రియ మొత్తం ఐదు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశముంది.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పెద్ది” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే తన తదుపరి సినిమాకు షిఫ్ట్ అవుతాడు. అందువల్ల సుకుమార్‌కు స్క్రిప్ట్ పూర్తిచేసుకునేందుకు సమయం మరింతగా లభిస్తోంది. రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన “రంగస్థలం” భారీ విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ ఆ ఇద్దరూ కలిసి పనిచేయబోతుండటంతో, ఈ కొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags

Next Story