‘ఓజీ 2’ ఇంకా పెద్ద స్కేల్ లో ఉంటుంది : సుజీత్

‘ఓజీ 2’ ఇంకా పెద్ద స్కేల్ లో ఉంటుంది : సుజీత్
X
‘ఓజీ’ ఫస్ట్ పార్ట్ జస్ట్ ట్రైల్ బాల్ మాత్రమే. నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి ఇంకా బిగ్గర్ సెలబ్రేషన్స్ ఉంటాయి,” అని అతడు చెప్పాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతోంది. డైరెక్టర్ సుజిత్ ఆల్రెడీ నానితో తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినా, “ఓజీ” ప్రమోషన్స్‌ని మాత్రం ఆపకుండా ఇప్పుడాయన యూఎస్ఏ టూర్లో ఉన్నారు. లేటెస్ట్ గా డల్లాస్‌లో జరిగిన స్క్రీనింగ్స్ టైమ్‌లో సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫ్యాన్స్‌తో మాట్లాడారు.

ఈ ఫ్రాంచైజీ కంటిన్యూ అవుతుందని, సెకండ్ పార్ట్ చాలా పెద్ద స్కేల్లో ఉంటుందని సుజిత్ హింట్ ఇచ్చారు. ‘ఓజీ’ ఫస్ట్ పార్ట్ జస్ట్ ట్రైల్ బాల్ మాత్రమే. నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి ఇంకా బిగ్గర్ సెలబ్రేషన్స్ ఉంటాయి,” అని అతడు చెప్పాడు.

“ఓజీ” మూవీ ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా, ప్రియాంక మోహన్ ఆయన వైఫ్‌గా నటించారు. అలాగే.. ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి కీ రోల్స్‌లో కనిపించారు. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించాడు.

Tags

Next Story