మైథలాజికల్ వరల్డ్ లోకి యంగ్ హీరోలు

కొన్నిసార్లు టైటిల్ ఒక్కటే ప్రేక్షకులను థియేటర్‌కు ఆకర్షించడానికి సరిపోతుంది. ‘జటాధర’ అనే టైటిల్ అలాంటి దివ్యమైన శక్తిని కలిగి ఉంది. ఇది పీస్ అండ్ పవర్ ఫుల్ లక్షణాలతో కూడిన శివుడిని సూచిస్తూ. తన శత్రువులపై శివ తాండవం చేయగల సామర్థ్యం ఉన్న పాత్రను సూచిస్తుంది. సుధీర్ బాబు ఈ శక్తివంతమైన ఫార్ములాతో తిరిగి ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. అతని అభిమానులు ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.
‘జటాధర’ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది, సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తోంది. ‘బాఘీ’ తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సుధీర్ బాబు, ‘జటాధర’ తో భారీ యుద్ధ జానర్‌లో సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ఈ గ్రాండ్ సినిమాలో సుధీర్ బాబు నటన ఎలా ఉంటుందో చూడడానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. అతని అభిమానులు ఈ సినిమా అతని కెరీర్‌లో కీలకమైన మలుపు అవుతుందని, గతంలోని వైఫల్యాలను అధిగమించి అతన్ని మెయిన్‌స్ట్రీమ్ హీరోగా నిలబెట్టడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నారు.
మరోవైపు.. అదే మార్గంలో పయనిస్తున్నాడు మరో హీరో నిఖిల్. ‘కార్తికేయ 2’ పాన్-ఇండియా విజయం సాధించిన తర్వాత, అతడు ఇప్పుడు మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ లో కనిపించనున్నాడు. ‘స్వయంభూ’ మహాభారతం నుండి కొన్ని అంశాలను తీసుకుంది. సినిమా గ్లింప్స్‌లో హీరో యోధుడి వైబ్‌తో, ఎపిక్ విజువల్స్‌తో ప్రేక్షకులకు గ్రాండ్ అనుభూతిని కలిగించేలా ఉంది. మోషన్ పోస్టర్లు, సినిమా గ్లింప్స్‌లు ఇప్పటికే దృశ్యపరంగా అద్భుతమైన అనుభవాన్ని సూచిస్తున్నాయి.
దర్శకుడు భరత్ కృష్ణమాచారి విజువల్ స్కేల్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు, సినిమాటోగ్రఫీని ‘బాహుబలి’ వంటి చిత్రాలకు పనిచేసిన సెంథిల్ కుమార్ నిర్వహిస్తున్నాడు. ఈ ఇద్దరు యువ హీరోల భుజాలపై భారీ బాధ్యత ఉంది. మరి ఈ గ్రాండ్ సినిమాలు వారి కెరీర్‌లకు ఎలాంటి ఫలితాలను తీసుకొస్తాయి అనేది ఆసక్తిగా మారింది.
-
Home
-
Menu