SSMB29.. కోరాపుట్ లో కొత్త షెడ్యూల్!

X
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న SSMB29 గురించి చిత్రబృందం నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. అయితే ఇప్పటికే సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టుకుని ఈ మూవీ లేటెస్ట్ గా రెండో షెడ్యూల్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన టీమ్.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం ఒడిశా వెళ్లిందట. అక్కడి కొరాపుట్ జిల్లా ప్రకృతి అందాల మధ్య న్యూ షెడ్యూల్ ని షురూ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత విశాఖపట్నంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక, కెన్యా వంటి దేశాల్లోనూ ఈ సినిమాకోసం వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేశాడట రాజమౌళి. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu