కెన్యాలో నెక్స్ట్ షెడ్యూల్ !

కెన్యాలో నెక్స్ట్ షెడ్యూల్  !
X
చిత్ర నిర్మాత కెఎల్ నారాయణ ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. కెన్యా రాజధాని నైరోబీ, టాంజానియాలోని అందమైన లొకేషన్స్‌లో సెప్టెంబర్ మూడో వారం నుంచి యాక్షన్‌తో కూడిన షెడ్యూల్ జరుగుతుందని ఆయన తెలిపారు.

ఇండియన్ స్ర్కీన్ పై అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘జెన్ 63’ (వర్కింగ్ టైటిల్). సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో ఈ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది హైదరాబాద్, ఒడిశాలో మూడు కీలక షెడ్యూళ్లను పూర్తి చేసింది. జులైలో కెన్యాలో షూటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ, అక్కడి రాజకీయ ఘర్షణల కారణంగా షెడ్యూల్ వాయిదా పడింది.

తాజాగా జరిగిన మీడియా సంభాషణలో.. చిత్ర నిర్మాత కెఎల్ నారాయణ ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. కెన్యా రాజధాని నైరోబీ, టాంజానియాలోని అందమైన లొకేషన్స్‌లో సెప్టెంబర్ మూడో వారం నుంచి యాక్షన్‌తో కూడిన షెడ్యూల్ జరుగుతుందని ఆయన తెలిపారు. రాజమౌళి, ఆయన టీమ్ ఈ షెడ్యూల్‌లో హై-ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇది ఇంండియాలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. 2027లో ఈ చిత్రం గ్రాండ్ పాన్-ఇంటర్నేషనల్ రిలీజ్ కానుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ బిగ్గీకి సౌండ్‌ట్రాక్ సమకూరుస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం, నవంబర్‌లో సినిమా ఫస్ట్ లుక్ విడుదలవుతుందని ప్రకటించింది.

Tags

Next Story