95 శాతం షూటింగ్ కెన్యాలోనే !

95 శాతం షూటింగ్ కెన్యాలోనే !
X
రాజమౌళి, నిర్మాత కేయల్. నారాయణతో తన సమావేశ ఫోటోలను షేర్ చేస్తూ, ముదవాడి ఈ సినిమా ఆఫ్రికన్ సీన్స్‌లో దాదాపు 95% కెన్యాలోనే షూట్ అవుతున్నాయని తెలిపారు.

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, రాజమౌళి “గ్లోబ్‌ట్రాటర్” (వర్కింగ్ టైటిల్) టీమ్ ప్రస్తుతం కెన్యాలో ఒక మేజర్ షూటింగ్ షెడ్యూల్ కోసం ఉన్నారు. రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఆఫ్రికన్ దేశానికి విమానంలో వెళ్తూ ఫోటోలు షేర్ చేసి ఈ లొకేషన్ గురించి హింట్ ఇచ్చింది. ఈ షూటింగ్ వల్ల మహేష్ బాబు ఈ ఏడాది తన కొడుకు పుట్టినరోజు, గణేష్ ఫెస్టివల్‌ను కుటుంబంతో జరుపుకోలేకపోయాడు.

టీమ్ సోషల్ మీడియాలో నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, కెన్యా ప్రైమ్ క్యాబినెట్ సెక్రటరీ మరియు ఫారిన్ అండ్ డయాస్పోరా అఫైర్స్ క్యాబినెట్ సెక్రటరీ ముసాలియా ముదవాడి నుండి అధికారిక నిర్ధారణ వచ్చింది. రాజమౌళి, నిర్మాత కేయల్. నారాయణతో తన సమావేశ ఫోటోలను షేర్ చేస్తూ, ముదవాడి ఈ సినిమా ఆఫ్రికన్ సీన్స్‌లో దాదాపు 95% కెన్యాలోనే షూట్ అవుతున్నాయని తెలిపారు.

“రాజమౌళి టీమ్‌లోని 120 మంది సిబ్బంది ఈస్ట్ ఆఫ్రికా అంతటా స్కౌటింగ్ టూర్ చేసిన తర్వాత కెన్యాను ప్రధాన షూటింగ్ లొకేషన్‌గా ఎంచుకున్నారు,” అని ముదవాడి రాశారు. “గ్లోబ్‌ట్రాటర్” ఒక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం. రాజమౌళి నవంబర్‌లో ఒక స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పాడు. ఈ సినిమా 2027 సమ్మర్‌లో రిలీజ్ అవుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి.

Tags

Next Story